డిజాస్టర్‌ రీమేక్‌తో బాలీవుడ్‌కు మహేష్‌..? | Mahesh Babu Bollywood Debut With Spyder Remake | Sakshi
Sakshi News home page

Jun 12 2018 11:55 AM | Updated on Jun 12 2018 11:57 AM

Mahesh Babu Bollywood Debut With Spyder Remake - Sakshi

భరత్‌ అనే నేను సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న సూపర్‌ స్టార్‌ అభిమానులు అవాక్కయ్యే వార్త ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మహేష్ బాబు కెరీర్‌లోనే బిగెస్ట్‌ డిజాస్టర్‌లలో ఒకటైన స్పైడర్‌ సినిమా రీమేక్‌ లో మహేష్ నటించనున్నారట. తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతోనే మహేష్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచిన  స్పైడర్‌ తమిళ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు మురుగదాస్‌.

ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడిన మురుగదా ఈ విషయాన్ని ధృవీకరించారు. స్పైడర్‌ సినిమా రీమేక్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వెల్లడించిన మురుగదాస్‌.. హీరో ఎవరన్నది కన్ఫామ్‌ చేయలేదు. దీంతో తెలుగు, తమిళ భాషల్లో మీరోగా నటించిన మహేషే, రీమేక్‌లోనూ నటిస్తారన్న ప్రచారం జరుగుతోంది.  గతంలో అనుపమా చోప్రాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బాలీవుడ్‌ ఎంట్రీపై స్పందించిన మహేష్‌, మంచి కథ దొరికితే హిందీ సినిమాకు రెడీ అన్నారు. దీంతో స్పైడర్‌ సినిమాతోనే మహేష్ బాలీవుడ్‌ ఎంట్రీ ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ వార్తలపై మహేష్ స్పందించాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement