ఎక్కడైనా స్టార్‌ కానీ..అక్కడ కాదు! | Mahesh Babu and Ram Charan Teja are holidaying in Switzerland | Sakshi
Sakshi News home page

ఎక్కడైనా స్టార్‌ కానీ..అక్కడ కాదు!

Dec 29 2016 11:33 PM | Updated on Jul 14 2019 1:57 PM

ఎక్కడైనా స్టార్‌ కానీ..అక్కడ కాదు! - Sakshi

ఎక్కడైనా స్టార్‌ కానీ..అక్కడ కాదు!

ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో... ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతే దూరం’ అనే సామెత ఉన్న విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమలో చాలామంది ఈ విధంగానే ఉంటారన్నది

‘ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో... ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతే దూరం’ అనే సామెత ఉన్న విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమలో చాలామంది ఈ విధంగానే ఉంటారన్నది కొందరి ఊహ. ముఖ్యంగా పెద్దింటి కుటుంబాలకు చెందిన హీరోలు అంత ఫ్రెండ్లీగా ఉండరని ఊహించుకుంటారు. అయితే ఆ ఊహ నిజం కాదని కొన్ని సంఘటనలు చెబుతుంటాయ్‌. తాజాగా, ఓ ఫొటో ఆ విషయాన్ని మరింత బలంగా చూపించింది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ చిరునవ్వులు చిందిస్తూ, దిగిన ఈ ఫొటో ఇక్కడిది కాదు. భార్యాపిల్లలతో కలసి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి మహేశ్‌ విదేశాలు వెళ్లారు.

ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ నగరంలో ఉన్నారు. రామ్‌చరణ్‌ కూడా అక్కడే ఉన్నారు. ఈ ఇండియన్‌ స్టార్స్‌ అక్కడ సందడి చేశారు. ఫొటో దిగి, ‘బియాండ్‌ బౌండరీస్‌... హ్యాపీ హాలీడేస్‌’ అని మహేశ్, చరణ్‌ సోషల్‌ మీడియాలో పెట్టారు. ఎక్కడైనా స్టార్‌ కాని ఫ్రెండ్‌షిప్‌ విషయంలో స్టార్‌ కాదన్నట్లుగా మహేశ్‌ – చరణ్‌ చెబుతున్నట్లుంది కదూ. అనుకోకుండా కలిసినా స్టార్‌ స్టేటస్‌ని పక్కన పెట్టి, ఇలా కాసేపు ఫ్రెండ్లీగా హాలిడేస్‌ని ఎంజాయ్‌ చేయడం స్నేహపూరిత వాతావరణాన్ని తెలియజేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement