మహేష్ 23 ఫస్ట్ లుక్ మళ్లీ వాయిదా | Mahesh Babiu, Murugadoss Movie First look Postponed again | Sakshi
Sakshi News home page

మహేష్ 23 ఫస్ట్ లుక్ మళ్లీ వాయిదా

Mar 29 2017 8:49 AM | Updated on Jul 23 2019 11:50 AM

మహేష్ 23 ఫస్ట్ లుక్ మళ్లీ వాయిదా - Sakshi

మహేష్ 23 ఫస్ట్ లుక్ మళ్లీ వాయిదా

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంత వరకు అఫీషియల్ ఫస్ట్ లుక్ మాత్రం రిలీజ్ కాలేదు. అంతేకాదు ఇంత వరకు సినిమాకు టైటిల్ కూడా నిర్ణయించకపోవడంతో ప్రమోషన్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ మహేష్ 23 ఫస్ట్ లుక్ను ఎట్టి పరిస్థితుల్లో ఉగాది రోజున విడుదల చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ సారి కూడా ఈ లాంచ్ వాయిదా పడింది. ప్రస్తుతం వియత్నాంలో యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్లో ఉన్న చిత్రయూనిట్ ఇండియాకు తిరిగి వచ్చాకే ఫస్ట్ లుక్ను లాంచ్ చేయాలని నిర్ణయించారట. ఏప్రిల్ 2న మహేష్ 23 యూనిట్ హైదరబాద్ తిరిగి వస్తోంది. ఆ తరువాతే ఫస్ట్ లుక్ లాంచ్ ఎప్పుడనే విషయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.

మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జూన్ 23న ఈ సినిమా రిలీజ్ అవుతుందని దర్శకుడు మురుగదాస్ ఇప్పటికే ప్రకటించాడు.

Advertisement
 
Advertisement
Advertisement