ఓవర్‌సీస్‌లో ‘మహానటి’కి బ్రహ్మరథం | Mahanati Overseas Collection Updates | Sakshi
Sakshi News home page

May 13 2018 12:27 PM | Updated on May 13 2018 4:26 PM

Mahanati Overseas Collection Updates - Sakshi

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు అదే స్థాయిలో వసూళ్లు కూడా సాధిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తున్న మహానటి చిత్రం ఓవర్‌ సీస్‌లో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే అమెరికాలో మిలియన్‌ డాలర్‌ (ఆరు కోట్ల రూపాయల) మార్క్‌ను దాటిన మహానటి సినిమా ఇతర ప్రాంతాల్లో కూడా అదే జోరు చూపిస్తోంది.

మహానటి ఓవర్‌ సీస్‌ కలెక్షన్ల వివరాలు ప్రముఖ బాలీవుడ్‌ ఎనలిస్ట్‌ తరణ్ ఆదర్శ్‌ వెల్లడించారు. తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా ఆస్ట్రేలియాలో 1,25,900 డాలర్లు (64.03 లక్షల రూపాయలు), యూకేలో 28,373 పౌండ్లు (25.90 లక్షల రూపాయలు), న్యూజీలాండ్‌లో 9,899 డాలర్లు ( 4.65 లక్షల రూపాయల) వసూళ్లు సాధించినట్టుగా వెల్లడించారు.

కీర్తి సురేష్‌.. సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమాకు నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. వైజయంతి మూవీస్‌, స్వప్నా సినిమా బ్యానర్లపై సీనియర్‌ నిర్మాత అశ్వనిదత్‌, ఆయన కుమార్తెలు స్వప్నాదత్, ప్రియాంకదత్‌లు ఈ సినిమాను నిర్మించారు. తెలుగు తమిళ భాషల్లో రిలీజ్‌ అయిన ఈ సినిమాను అన్ని చోట్లా సూపర్‌ హిట్ రావటంతో వసూళ్ల పరంగా కూడా మహానటి చిత్రం సత్తా చాటుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement