ఈసారికి నన్ను వదిలేయండి: మాధురి | Madhuri not returning for 'Jhalak Dikhhla Jaa 8' | Sakshi
Sakshi News home page

ఈసారికి నన్ను వదిలేయండి: మాధురి

Jun 22 2015 2:54 PM | Updated on Sep 3 2017 4:11 AM

ఈసారికి నన్ను వదిలేయండి: మాధురి

ఈసారికి నన్ను వదిలేయండి: మాధురి

గడిచిన మూడేళ్లుగా డాన్సింగ్ రియాల్టీ షో 'ఝలక్ దిఖ్లాజా' కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్.. ఈసారి ఎనిమిదో సీజన్కు మాత్రం దానికి రావట్లేదట.

గడిచిన మూడేళ్లుగా డాన్సింగ్ రియాల్టీ షో 'ఝలక్ దిఖ్లాజా' కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్.. ఈసారి ఎనిమిదో సీజన్కు మాత్రం దానికి రావట్లేదట. కలర్స్ చానల్ నిర్వహించే ఈ ధమాకా డాన్స్ షోకు ఈసారి తనను జడ్జిగా ఉంచొద్దని మాధురి (48) చెప్పింది. అదే చానల్లో మరో ప్రాజెక్టు మీద తాను దృష్టి సారించాల్సి ఉందదని, అందువల్ల తనను ఈసారికి వదిలేయాలని కోరిందట.

మరింత ఉత్తేజితంగా ఉండో మరో ప్రాజెక్టుతో తాను రాబోతున్నట్లు చెప్పింది. ఝలక్ దిఖ్లాజా కార్యక్రమం ఈసారి కూడా సూపర్ సక్సెస్ అవ్వాలంటూ శుభాకాంక్షలు మాత్రం అందజేసింది. ఝలక్ కార్యక్రమం మాధురిని తప్పకుండా మిస్సవుతుంది గానీ, చానల్లో మాత్రం మరో రూపంలో ఆమె వస్తారని కలర్స్ సీఈవో రాజ్ నాయక్ తెలిపారు. మాధురి స్థానంలో షాహిద్ కపూర్ను తీసుకుంటే ఎలా ఉంటుందని తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement