తల్లి పాత్రలో... | Madhubala mother role in kumara swami son movie | Sakshi
Sakshi News home page

తల్లి పాత్రలో...

Aug 8 2018 1:12 AM | Updated on Aug 8 2018 1:12 AM

Madhubala mother role in kumara swami son movie - Sakshi

సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ కథానాయికగా సత్తా చాటారు మధుబాల. ముఖ్యంగా ‘రోజా’ చిత్రంలో ఆమె నటనకు ఆడియన్స్‌ ఫుల్‌మార్క్స్‌ వేశారు. హీరోయిన్‌ నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా టర్న్‌ తీసుకున్న తర్వాత కూడా మధుబాల మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. ‘అంతకు ముందు ఆ తరువాత, సూర్య వర్సెస్‌ సూర్య, నాన్నకు ప్రేమతో’ చిత్రాల్లో కీలక పాత్రలు చేశారామె. ప్రస్తుతం కన్నడ చిత్రం ‘సీతరామకల్యాణ’లో నటిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవగౌడ మనవడు, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి కొడుకు నిఖిల్‌ ఇందులో హీరోగా నటిస్తున్నారు.

రచితా రామ్‌ కథానాయికగా నటిస్తున్నారు.  రచితారామ్‌కు తల్లిదండ్రుల పాత్రల్లో మధుబాల, శరత్‌కుమార్‌ నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ బెంగళూరులో జరుగుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ‘జాగ్వార్‌’ సినిమాతో నిఖిల్‌ తెలుగుతెరపై మెరిశారు. 

Advertisement
 
Advertisement
Advertisement