ఆదంత్యం నవ్వించేలా ‘మేడ్‌ ఇన్‌ చైనా’ ట్రైలర్‌

Made In China Movie Trailer Director Speak About Rajkumar Rao - Sakshi

బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌రావు నటించిన తాజా చిత్రం ‘మేడ్‌ ఇన్‌ చైనా’ ట్రైలర్‌ విడుదలైంది. గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త రఘు జీవితకథ ఆధారంగా ‘మేడ్‌ ఇన్‌ చైనా’  సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా చిత్ర దర్శకుడు మిఖిల్‌ మాట్లాడుతూ.. ‘రాజ్‌కుమార్‌ రావు ‘మేడ్‌ ఇన్‌ చైనా’ చిత్రంలో నటించడానికి తన జీవితాన్ని కూడా రిస్కులో పెట్టారు. చిత్రంలోని పాత్ర కోసం అతడు షూటింగ్‌కు ముందు నెలరోజలపాటు చైనాలో గడిపారు. అక్కడ మాట్లాడే భాషను ఇష్టంగా నేర్చుకున్నారు. ముఖ్యంగా సినిమాలో లావుగా ఉండే పాత్ర కోసం శరీర బరువును సుమారు ఎనిమిది కిలోలు పెంచుకున్నారు. ఈ చిత్రానికి సంతకం చేయడానికి ముందునుంచే తన పాత్ర కోసం పలు జాగ్రత్తలు తీసుకున్నార’ని తెలిపారు.

మిఖిల్‌ ఇంతకుముందు ‘రాంగ్ సైడ్ రాజు’ చిత్రానికి దర్శకత్వం వహించి, జాతీయ అవార్డును సాధించిన విషయం తెలిసిందే. ‘హిందీ మీడియం’ ఫేమ్ దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మౌనీ రాయ్ రాజ్‌కుమార్‌రావుకు జంటగా.. వ్యాపారవేత్త రఘు భార్య రుక్మిణి పాత్రలో నటిస్తున్నారు. వ్యాపారవేత్త రఘు భారతదేశం నుంచి చైనా సందర్శనకు వెళ్లిన తీరు, అక్కడ ఆయన ఎదుర్కొన్న కష్టాలు, అనుభవాలు, ఆయన వ్యాపారవేత్తగా ఎదిగిన తీరు.. అన్ని అంశాలను ఫన్నీగా ప్రేక్షకులకు చూపినట్టు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. కడుపుబ్బా నవ్వించేలా ఉన్న ఈ సినిమా ట్రైలర్‌కు సోషల్‌ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది. ‘మేడ్ ఇన్ చైనా’ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top