సస్పెన్స్‌ థ్రిల్లర్‌ | m6 movie released on february | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

Jan 19 2019 2:20 AM | Updated on Jan 19 2019 2:20 AM

m6 movie released on february - Sakshi

ధృవ, అశ్వని

ధ్రువ, అశ్విని, శ్రావణి, తిలక్, సాధన, అప్పలరాజు, హరిత, వంశీ, ఇంద్రతేజ ముఖ్య తారలుగా జైరామ్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘యమ్‌ 6’. విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్‌ పతాకాలపై విశ్వనాథ్‌ తన్నీరు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. విశ్వనాథ్‌ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే అద్భుతమైన కథని  జైరాం అంతే అద్భుతంగా తెరకెక్కించారు.

ఫిబ్రవరి మొదటి వారంలో  రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ‘‘ఇలాంటి సినిమాలు తమిళ, మలయాళ, కన్నడలో వచ్చేవి. తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ రకమైన సినిమాల్ని ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అన్నారు జై రామ్‌వర్మ.  ‘‘మంచి చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతుండటం హ్యాపీగా ఉంది’’ అని ధ్రువ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బాలాజీ, కెమెరా: మహ్మద్‌ రియాజ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సురేష్, సమర్పణ:  పార్వతి.

Advertisement
 
Advertisement
Advertisement