‘యూరి’పై వెంకయ్య నాయుడు ప్రశంసల జల్లు | M Venkaiah Naidu Praised URI Movie | Sakshi
Sakshi News home page

Jan 30 2019 3:18 PM | Updated on Jan 30 2019 3:25 PM

M Venkaiah Naidu Praised URI Movie - Sakshi

పాకిస్తాన్‌పై మన దేశ ఆర్మీ చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్‌కు ఎంతటి స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఘటన ఆధారంగా తెరకెక్కించిన యూరీ సినిమాకు కూడా అంతటి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిత్రయూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

సినిమాను వీక్షించిన అనంతరం వెంకయ్య నాయుడు తన అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘నా కుటుంబసభ్యులు, కార్యదర్శి శ్రీ ఐ.వి.సుబ్బారావు మరియు ఉపరాష్ట్రపతి నివాసంలోని ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సిబ్బందితో కలిసి “యూరి – ద సర్జికల్ స్ట్రైక్” సినిమాను వీక్షించడం జరిగింది. దేశభక్తిని రగిల్చి, మన భారత సైన్య అకుంఠిత దీక్షను, పోరాట పటిమను, ధైర్యసాహసాలను కళ్ళకు కట్టినట్లు “యూరి –ద సర్జికల్ స్ట్రైక్” సినిమాలో చూపించారు. ఎంతో స్ఫూర్తి దాయకంగా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్యధర్ తో పాటు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు’ అంటూ ట్వీట్‌చేశారు. యూపీ ప్రభుత్వం ఈ చిత్రానికి జీఎస్టీ నుంచి మినహాయింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement