చర్చనీయాంశమయ్యే ప్రేమకథ | , Love story a criminal | Sakshi
Sakshi News home page

చర్చనీయాంశమయ్యే ప్రేమకథ

Jun 14 2014 12:05 AM | Updated on Mar 21 2019 9:07 PM

చర్చనీయాంశమయ్యే ప్రేమకథ - Sakshi

చర్చనీయాంశమయ్యే ప్రేమకథ

చాలామంది కాలేజీ అమ్మాయిలతో మాట్లాడి ఎంతో పరిశోధన చేసి ఈ కథాంశం తయారు చేశాను.

‘‘చాలామంది కాలేజీ అమ్మాయిలతో మాట్లాడి ఎంతో పరిశోధన చేసి ఈ కథాంశం తయారు చేశాను. కచ్చితంగా చర్చనీయాంశమయ్యే ప్రేమకథ ఇది’’ అని దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రావ్య ఫిలింస్ పతాకంపై కృష్ణమూర్తి సమర్పణలో యక్కలి రవీంద్రబాబు నిర్మించిన చిత్రం ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’. మనోజ్ నందం, అనిల్ కల్యాణ్, ప్రియాంక పల్లవి, దివ్య, సత్యానంద్. ఎల్ తదితరులు ఇందులో ముఖ్యతారలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని శుక్రవారం హైదరాబాద్‌లో సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు, సీనియర్ ఫొటో జర్నలిస్ట్ సాయిరమేశ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. క్రైమ్‌ని ఎంకరేజ్ చేయకుండా పాజిటివ్‌గా ఉండే చిత్రమిదని మనోజ్ నందం చెప్పారు. అమాయకత్వంతో కూడిన కామెడీ పాత్ర చేశానని అనిల్ కల్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక ప్రియాంక పల్లవి, ఎడిటర్ అర్చన ఆనంద్, సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి. బాపిరాజు, రాజా. జి, ఎఫ్‌ఎమ్ బాబాయ్ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement