లింగ ... రెండు వేల థియేటర్లల్లో విడుదల | 'Lingaa' cleared with 'U' certificate | Sakshi
Sakshi News home page

లింగ ... రెండు వేల థియేటర్లల్లో విడుదల

Nov 26 2014 12:38 PM | Updated on May 24 2018 3:01 PM

లింగ ... రెండు వేల థియేటర్లల్లో విడుదల - Sakshi

లింగ ... రెండు వేల థియేటర్లల్లో విడుదల

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం లింగ.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం లింగ. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు లింగ నిర్మాత రాక్లైన్ వెంకటేష్ బుధవారం చెన్నైలో వెల్లడించారు. లింగా చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ సరిఫ్టికేట్ ఇచ్చారని తెలిపారు. లింగ చిత్రం తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రజనీకాంత్ జన్మదినమైన డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు.

రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టిలు నటించిన ఈ చిత్రానికి ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. ప్రముఖ దర్శకుడు కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో గతంలో రజనీ ముత్తు, నరసింహ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. లింగ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement