‘శ్రీదేవికి ప్రశాంతత ఇవ్వండి’

Let her rest in Peace Hastag Trending in Tollywood - Sakshi

శ్రీదేవి మరణవార్త ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా భారతీయ సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. కోట్లది మంది అభిమానులతో పాటు సినీ ప్రముఖుటూ ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే శ్రీదేవి మరణవార్త తెలిసిన దగ్గర నుంచి మీడియాలో వస్తున్న కథనాలపై సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా శ్రీదేవి మరణానికి కారణల విషయంలో మీడియా అత్యుత్సాహంగా వ్యవహరిస్తుందని విమర్శలు వినిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా మీడియాకు విన్నవించుకుంటున్నారు . ‘లెట్‌ హర్ రెస్ట్ ఇన్‌ పీస్‌’ (#LetHerRestinPeace) అనే ట్యాగ్‌తో మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నారు. హీరోలు హీరోయిన్లు సాంకేతిక నిపుణులు ఈ ట్యాగ్‌ ను జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అల్లు అర్జున్‌, రానా దగ్గుబాటి, కాజల్‌ అగర్వాల్‌, తాప్సీ లాంటి టాప్‌ స్టార్లు ఈ ట్యాగ్‌తో తమ స్పందన తెలియజేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top