విలక్ష్మీణమైన పాత్ర

Laxmmi bomb First Look Release - Sakshi

‘‘మనం చాలా సులువైన పనులు కాకుండా కష్టతరమైనవి చేస్తున్న  క్షణం నుంచే ఓ కొత్త జీవితం ప్రారంభం అవుతుంది’’ అంటున్నారు అక్షయ్‌ కుమార్‌. యాక్షన్, కామెడీ జానర్లలో ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్షయ్‌ బాలీవుడ్‌లో ఆకట్టకుంటుంటారు. ప్రస్తుతం లక్ష్మీ అనే అమ్మాయిగా ‘లక్ష్మీ బాంబ్‌’ సినిమాలో నటిస్తున్నారు. తెలుగు , తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘కాంచన’ చిత్రానికి ఇది హిందీ రీమేక్‌. ‘కాంచన’ చిత్రాన్ని రూపొందించిన రాఘవ లారెన్స్‌ ఈ రీమేక్‌ను డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇందులోని లక్ష్మీ పాత్ర లుక్‌ను అక్షయ్‌ షేర్‌ చేస్తూ – ‘‘నవరాత్రి అంటే మనలో దేవతకు తలవంచుతూ, మన అసాధారణ శక్తి సామర్థ్యాలను సెలబ్రేట్‌ చేసుకోవడమే. ఈ సందర్భంగా నేను చేస్తున్న లక్ష్మీ లుక్‌ను పంచుకుంటున్నాను. చాలా ఉద్వేగంగా, కొంచెం టెన్షన్‌గా ఉంది’’ అని ట్వీట్‌ చేశారు. కియారా అద్వానీ హీరోయిన్‌. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌ 5న రిలీజ్‌ కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top