చైనా, కొరియా, థాయ్ భాషల్లో 'కాంచన' | lawrence kanchana movie remake in international languages | Sakshi
Sakshi News home page

చైనా, కొరియా, థాయ్ భాషల్లో 'కాంచన'

Dec 26 2015 2:15 PM | Updated on Sep 3 2017 2:37 PM

చైనా, కొరియా, థాయ్ భాషల్లో 'కాంచన'

చైనా, కొరియా, థాయ్ భాషల్లో 'కాంచన'

సౌత్ ఇండస్ట్రీలో హర్రర్ కామెడీలతో భారీ వసూళ్లను రాబట్ట వచ్చని ప్రూవ్ చేసిన సినిమా కాంచన. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ హర్రర్ మూవీ తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయం సాధించింది.

సౌత్ ఇండస్ట్రీలో హర్రర్ కామెడీలతో భారీ వసూళ్లను రాబట్టవచ్చని ప్రూవ్ చేసిన సినిమా కాంచన. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ హర్రర్ మూవీ తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయం సాధించింది. తరువాత ఈ సినిమాకు గంగ పేరుతో సీక్వల్ను రూపొందించిన లారెన్స్ మరోసారి భారీ హిట్తో అలరించాడు. ఇప్పుడు మరో అరుదైన ఫీట్తో కాంచన సినిమా వార్తల్లోకి వచ్చింది.

గతంలో ఏ సౌత్ సినిమాకూ దక్కని అరుదైన ఘనత కాంచన సినిమా సొంతం కానుంది. ఇటీవల సినిమా నిర్మాణ రంగంలోకి  అడుగుపెట్టిన రామా సంస్థ కాంచన సినిమాను విదేశీ భాషల్లో రీమేక్ చేయడానికి రెడీ అవుతోంది. సౌత్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న చైనాతో పాటు, కొరియా, థాయ్ భాషల్లోకి కాంచన సినిమా రీమేక్కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ రీమేక్పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement