రీమేక్లో రాక్షసి..! | Lavanya Tripathi confirmed for 100 Love Tamil Remake | Sakshi
Sakshi News home page

రీమేక్లో రాక్షసి..!

Jun 29 2017 1:42 PM | Updated on Sep 5 2017 2:46 PM

రీమేక్లో రాక్షసి..!

రీమేక్లో రాక్షసి..!

కాస్త స్లోగా కెరీర్ కొనసాగిస్తున్న అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మరో క్రేజీ ఆఫర్ను సొంతం చేసుకుంది. తెలుగులో సీనియర్ హీరోలతో

కాస్త స్లోగా కెరీర్ కొనసాగిస్తున్న అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మరో క్రేజీ ఆఫర్ను సొంతం చేసుకుంది. తెలుగులో సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ జోడి కడుతున్న ఈ బ్యూటీ, కోలీవుడ్ లోనూ దూసుకుపోతోంది. తాజాగా ఓ రీమేక్ సినిమాలో హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేసింది లావణ్య. ఈ సినిమా టాలీవుడ్లో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ కావటంతో కోలీవుడ్లో హిట్ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉంది.

నాగచైతన్య, తమన్నా కాంబినేషన్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 100% లవ్. ఈ సినిమాను జీవీ ప్రకాష్ హీరోగా తమిళ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు ముందుగా హెబ్బా పటేల్ను హీరోయిన్గా తీసుకోవాలని భావించినా.. ఫైనల్గా లావణ్యత్రిపాఠినే ఫైనల్ చేశారట. ప్రస్తుతం కాలేజ్ అమ్మాయిగా కనిపించేందుకు స్లిమ్ అయ్యే పనుల్లో బిజీగా ఉంది లావణ్య.

Advertisement
 
Advertisement
Advertisement