‘మీటూ’ నేపథ్యంలో... | last seen movie first look launch | Sakshi
Sakshi News home page

‘మీటూ’ నేపథ్యంలో...

Oct 28 2018 5:40 AM | Updated on Oct 28 2018 5:40 AM

last seen movie first look launch - Sakshi

దీపక్, తులికా సింగ్‌

హర్ష్, తులికా సింగ్, హిమాయత్, మధు నారాయణన్‌ ముఖ్య తారలుగా దీపక్‌ బల్‌దేవ్‌ ఠాకూర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లాస్ట్‌ సీన్‌’. జి.పి.ఏ ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీ ప్రకాష్‌ ఠాకూర్‌ సమర్పణలో రూపొందుతోంది. భారతి సిమెంట్స్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) ఆర్‌.రాఘవ ప్రతాప్‌ ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. దీపక్‌ బల్‌దేవ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయిన ‘మీటూ’ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ జవహర్‌ రెడ్డి, ఎడిటర్‌ నాగిరెడ్డి మా చిత్రానికి పని చేస్తుండటం గర్వంగా భావిస్తున్నాం. మేజర్‌ షెడ్యూల్‌ ఊటీలో చేశాం. 80 శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. ‘‘బహుముఖ ప్రతిభాశాలి అయిన దీపక్‌ బలదేవ్‌ తెరకెక్కిస్తోన్న ‘లాస్ట్‌ సీన్‌’ ఫస్ట్‌ లుక్‌ నా చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించి, చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు ఆర్‌. రాఘవ ప్రతాప్‌. ‘‘మహా నగరం వెళ్లి దర్జాగా బతకాలనుకునే ఓ పల్లెటూరి అమ్మాయికి ఎదురైన ఆసక్తికర సంఘటనలతో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతుండడం గర్వంగా ఉంది’’ అని తులికా సింగ్‌ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిల్‌–సంజీవ్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement