'ఆమెకు సిగరెట్ కాల్చడం నేర్పా' | Lakshmi Manchu learnt to smoke for 'Chandamama Kathalu' | Sakshi
Sakshi News home page

'ఆమెకు సిగరెట్ కాల్చడం నేర్పా'

Apr 25 2014 12:58 PM | Updated on Sep 2 2017 6:31 AM

'ఆమెకు సిగరెట్ కాల్చడం నేర్పా'

'ఆమెకు సిగరెట్ కాల్చడం నేర్పా'

చందమామ కథలు సినిమాలో ఒక పాత్ర కోసం లక్ష్మీ మంచుకు సిగరెట్ కాల్చడం నేర్పించానని చెబుతున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.

సినిమాల్లో హీరోలు సిగరెట్లు కాల్చే సన్నివేశాలు చాలానే ఉంటాయి. అయితే.. హీరోయిన్లు, ఇతర నటీమణులు సిగరెట్ కాల్చడం మాత్రం తక్కువ. అందులోనూ అప్పటివరకు ఏమాత్రం అలవటు లేకుండా కేవలం సినిమా కోసం, అందులో పాత్ర కోసం సిగరెట్ కాల్చాల్సి వస్తే? లక్ష్మీ మంచుకు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 'చందమామ కథలు' సినిమాలో ఆమె ఒక మోడల్ పాత్ర పోషించారు. పాత్ర స్వరూప స్వభావాలను బట్టి సిగరెట్ కాల్చాల్సి ఉంటుంది. (చదవండి: సినిమా రివ్యూ)

కానీ ఇంతవరకు లక్ష్మికి పొగతాగడం అలవాటు లేదు. అందుకే ఆమె కొంత తటపటాయించారు. కానీ, దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాత్రం ఆమెను సిగరెట్ కాల్చాల్సిందిగా కోరారు. కొంత నచ్చజెప్పిన తర్వాత ఆమె అర్థం చేసుకుని అంగీకరించారని, అలా తాను తొలిసారి లక్ష్మికి సిగరెట్ కాల్చడం నేర్పించానని ప్రవీణ్ చెప్పారు. అదంత సులభం కాకపోయినా.. పాత్రకోసం ఆమె అలా చేశారని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement