కుమారితో ప్రేమాయణం | kumari 21f first look | Sakshi
Sakshi News home page

కుమారితో ప్రేమాయణం

Sep 13 2015 10:36 PM | Updated on Sep 3 2017 9:20 AM

కుమారితో ప్రేమాయణం

కుమారితో ప్రేమాయణం

రాజ్ తరుణ్ ఇప్పుడు కుమారి అనే అందమైన అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు.

రాజ్ తరుణ్ ఇప్పుడు కుమారి అనే అందమైన అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ లవ్ రియల్ కాదు.. రీల్ కోసం. రాజ్ తరుణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ కథ అందించి, నిర్మిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్’. హీబా పటేల్ కథానాయిక. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఆవిష్కరించారు. ‘‘సుకుమార్ శైలిలో సాగే డిఫరెంట్ లవ్‌స్టోరీ ఇది. దేవిశ్రీప్రసాద్ మంచి బాణీలిచ్చారు’’ అని రత్నవేలు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ-
 
‘‘ఈ సినిమాతో రాజ్‌తరుణ్ మంచి హిట్‌ను అందుకోవడం ఖాయం. త్వరలో పాటలను, అక్టోబర్ 30న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. అంతర్లీనంగా సాగే సందేశంతో సాగే యూత్‌ఫుల్ మూవీ ఇదని రాజ్ తరుణ్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement