రాజ్ తరుణ్, అమృతా చౌదరి జోడీగా నటించిన చిత్రం ‘టార్టాయిస్’. రిత్విక్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.
ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్, మధుపాల మహా మూవీస్ పతాకంపై రాజ్ విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, మధుపాల సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘‘నిద్రలో నడిచే అలవాటు ఉన్న హీరో ఒక అమ్మాయిని హత్య చేస్తాడు. ఆ తర్వాత ఏమి జరుగుతుంది? అనే కాన్సెప్ట్‌తో ‘టార్టాయిస్’ రూపొందింది’’ అని యూనిట్ సభ్యులు తెలిపారు.


