ఓ ఫెమినిస్ట్‌గా చెబుతున్న మాటలివి..! | ఓ ఫెమినిస్ట్‌గా చెబుతున్న మాటలివి..! kriti sanon feminist dialogues | Sakshi
Sakshi News home page

ఓ ఫెమినిస్ట్‌గా చెబుతున్న మాటలివి..!

Jan 16 2014 1:23 AM | Updated on Sep 2 2017 2:38 AM

ఓ ఫెమినిస్ట్‌గా చెబుతున్న మాటలివి..!

ఓ ఫెమినిస్ట్‌గా చెబుతున్న మాటలివి..!

‘‘గతంలో యాడ్స్‌లో నటించాను. ఇప్పుడు ఉన్నట్టుండి హీరోయిన్ అయిపోయాను. కథానాయికగా నటించిన తొలి సినిమానే సూపర్‌స్టార్ మహేష్‌తో

 ‘‘గతంలో యాడ్స్‌లో నటించాను. ఇప్పుడు ఉన్నట్టుండి హీరోయిన్ అయిపోయాను. కథానాయికగా నటించిన తొలి సినిమానే సూపర్‌స్టార్ మహేష్‌తో చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘1’ చిత్రానికి కుటుంబ ప్రేక్షకుల ఆదరణ లభిస్తోందని తెలిసింది. ఇంతమంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని కృతి సనన్ అన్నారు. మహేష్‌బాబు కథానాయకునిగా.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘1 నేనొక్కడినే’. ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన కృతి సనన్ హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.
 
ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘తెలుగుతెరపై హాలీవుడ్ స్థాయిలో తీసిన ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ ద్వారా సోలో హీరోయిన్‌గా పరిచయం అవ్వడం గర్వంగా ఉంది. మహేష్‌తో నటించడం నిజంగా మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్. సెట్‌లో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ఆయన... ఒక్కసారి కెమెరా ముందుకెళితే.. పాత్రలా మారిపోతారు. నిజంగా అమేజింగ్ అనిపించింది. జర్నలిస్ట్ పాత్ర పోషణ విషయంలో... ఎంతో హోమ్‌వర్క్ చేశాను. ఈ విషయంలో సుకుమార్‌గారి సహకారం మరచిపోలేను’’ అన్నారు. 
 
ఈ సినిమా పోస్టర్‌పై వచ్చిన వివాదం గురించి మాట్లాడుతూ -‘‘అది కేవలం పాటలో భాగమే. సినిమా మొత్తం అలా ఉండదు. ఈ పోస్టర్ విషయంలో ప్రతి ఒక్కరూ నన్నే టార్గెట్ చేశారు. స్త్రీల మనోభావాలు దెబ్బతినేలా నేను ప్రవర్తించను. ఓ స్వతంత్య్రభావాలు కలిగిన స్త్రీగా, ఓ ఫెమినిస్ట్‌గా నేను చెబుతున్న మాటలివి’’ అని చెప్పారు కృతి. తన హైట్ అయిదడుగు తొమ్మిది అంగుళాలని, తన శారీరక భాషకు తగ్గ పాత్రలు లభిస్తే చేస్తానని, త్వరలో ఆమిర్‌ఖాన్‌తో ఓ సినిమా చేయబోతున్నానని కృతి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement