కుర్రాడు కొత్త | Kotha Kurradu Audio Launch | Sakshi
Sakshi News home page

కుర్రాడు కొత్త

Apr 6 2018 12:08 AM | Updated on Apr 6 2018 12:08 AM

Kotha Kurradu Audio Launch  - Sakshi

శ్రీరామ్, శ్రీప్రియ

శ్రీరామ్, శ్రీప్రియ జంటగా రాజా నాయుడు. ఎన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త కుర్రోడు’. లైట్‌ ఆఫ్‌ లవ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై పదిలం లచ్చన్న దొర (లక్ష్మణ్‌) నిర్మించారు. సాయి ఎలేందర్‌ స్వరపరచిన ఈ సినిమా పాటల సీడీలను నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేయగా, మరో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ స్వీకరించారు. రాజా నాయుడు. ఎన్‌ మాట్లాడుతూ– ‘‘చక్కని కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్మణ్‌గారు అండగా నిలబడి సినిమాను పూర్తి చేశారు.

మా అమ్మాయి శ్రీప్రియను ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నా. శ్రీరామ్‌ చక్కగా నటించాడు’’ అన్నారు. ‘‘రాజా నాయుడుగారు సినిమాను అనుకున్న ప్రణాళిక ప్రకారం చక్కగా తీశారు. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు పదిలం లచ్చన్న దొర. ‘‘మా నాన్నగారు థియేటర్‌ ఆపరేటర్‌. ఆయన వల్ల నాకు సినిమాలంటే ఆసక్తి కలిగింది. అదే ఉత్సాహంతో హీరోగా ఎదిగాను’’ అన్నారు శ్రీరామ్‌. ‘‘డైరెక్టర్‌ మా నాన్నగారు అయినా కూడా నన్ను ఆడిషన్‌లోనే ఎంపిక చేసుకున్నారు’’ అన్నారు శ్రీప్రియ. ఈ చిత్రానికి కెమెరా: సతీశ్‌ ముదిరాజ్‌.

Advertisement
 
Advertisement
Advertisement