అలాంటి వాటికి నేను వ్యతిరేకం: కొరటాల శివ | Koratala Siva Responds On Sri Reddy Issue | Sakshi
Sakshi News home page

శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కొరటాల శివ

Apr 17 2018 5:10 PM | Updated on Aug 28 2018 4:32 PM

Koratala Siva Responds On Sri Reddy Issue - Sakshi

శ్రీరెడ్డి, కొరటాల శివ (జతచేసిన చిత్రం)

సాక్షి, సినిమా: టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ వ్యాఖ్యలపై స్పందించారు. ఇటీవల శ్రీరెడ్డి ఇందులో సమాజ సేవ పేరుతో సినిమాలు తీసే స్టార్‌ డైరెక్టర్‌లు కూడా ఉన్నారని చెప్పారు.  దీనికి కొరటాల స్పందిస్తూ.. తానేంటో తన చుట్టూ ఉన్న వారికి తెలుసని, అలాంటిది సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిలో తన పేరు కూడా రావడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. అలాంటి విషయాలకు, అలాంటి పనులుకు తాను పూర్తిగా వ్యతిరేకమన్నారు.

నాకు తెలిసిన వాళ్లకి, నా చుట్టు పక్కన వారిని కూడా నేను అలాంటివి ప్రోత్సహించను. నేను తీసిన నాలుగు సినిమాల్లో చాలా మందితో పనిచేశాను. నాకు ఆడ, మగ అనే తేడా లేదు. అందరి పట్ల చాలా కృతజ్ఞతగా ఉంటానను. ఎవరిని అసభ్యకరమైన వాఖ్యలతో కూడా పిలవను. అది ఏదో గాసిప్‌ లాగా ఉంటే నేను స్పందించే వాడిని కాదు. కానీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నా పేరు చాలా వైరల్‌ అవుతోంది. అందుకు నేను పర్సనల్‌గా స్పందిస్తున్నాను. నా లైఫ్‌లో ఆడవారికి చాలా ప్రాధాన్యత ఉంది. నా నుంచి ఇండస్ట్రీకి ఎలాంటి చెడు జరగకూడదని కోరుకుంటాను. అలాంటిది నా పేరు అందులో రావటం చాలా బాధాకరమ’ని కొరటాల శివ అన్నారు.

టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, తనకు చాలా అన్యాయం జరిగిందంటూ నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెతో పాటు మహిళా ఆర్టిస్టులు కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేశారు. వీరికి మహిళా సంఘాలు బాసటగా నిలిచాయి.

Advertisement
 
Advertisement
Advertisement