రకుల్‌కు కలిసిరాని కోలీవుడ్‌ | kollywood not chance to rakul preet singh | Sakshi
Sakshi News home page

రకుల్‌కు కలిసిరాని కోలీవుడ్‌

Jan 4 2018 8:06 PM | Updated on Jul 23 2019 11:50 AM

kollywood not chance to rakul preet singh - Sakshi

సాక్షి, సినిమా : నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు కోలీవుడ్‌ అచ్చిరాలేదా? అంటే అవుననే అంటున్నాయి పరిస్థితులు. అనుష్క నుంచి తమన్నా, కాజల్‌ లాంటి చాలా మందిని  కోలీవుడ్‌ తొలుత నిరాకరించింది. వారందరు టాలీవుడ్‌కు వెళ్లి అక్కడ అదృష్టాన్ని పరిక్షించుకుని నిలదొక్కుకున్న తరువాత కోలీవుడ్‌కు మళ్లీ స్వాగతించారు.  రకుల్‌ అదే విధంగా కోలీవుడ్‌లో పుత్తగం, తడయార తాక్క, ఎన్నమో ఏదో వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌కు మకాం మార్చింది. ఆమె అక్కడ వరుస అవకాశాలతో స్టార్‌ హీరోలతో నటించి క్రేజీ నాయకిగా పేరు తెచ్చుకుంది. దీంతో కోలీవుడ్‌ దృష్టి మళ్లీ రకుల్‌ప్రీత్‌ సింగ్‌పై పడింది. 

ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌కు జంటగా నటించడంతోనే కోలీవుడ్‌లో అవకాశాలు రావడం మొదలుపట్టాయి. దీంతో రకుల్‌ కోలీవుడ్‌లో ఒక రౌండ్‌ కొట్టొచ్చని కలలు కంది. అంతే కాదు దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ విజయ్‌ హీరోగా చేయబోయే తన తదుపరి చిత్రంలో రకుల్‌కు అవకాశం కల్సించినట్లు ప్రచారం జరిగింది. అదే విధంగా సూర్యకు జంటగా నటించే అవకాశాన్ని రకుల్‌ అందుకుంది. అయితే తను నటించిన స్పైడర్‌ చిత్రం హిట్‌ కాకపోవడం ఆమెకు శాపంగా మారిందనే చెప్పాలి.  సూర్యతో నటించే అవకాశాన్ని, విజయ్‌తో నటించే అవకాశాన్ని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కోల్పోయింది. కారణాలేమైనా ఇప్పుడు ఆ రెండు అవకాశాలను నటి కీర్తీపురేశ్‌ తన్నుకు పోయింది. అలా ఇంతకు ముందు హీరోయిన్ల సెంటిమెంట్‌ రకుల్‌కు వర్కౌట్‌ కాలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ పెద్దగా చిత్రాలు లేవు. అంతగా వెలిగిన రకుల్‌ ఒక్కసారిగా పడిపోయింది. టైమ్‌ అంటే ఇదేనేమో!

Advertisement
 
Advertisement
Advertisement