జాన్వీపై కోలీవుడ్‌ కన్ను | Kollywood focus on Janvi | Sakshi
Sakshi News home page

జాన్వీపై కోలీవుడ్‌ కన్ను

Dec 31 2017 7:04 AM | Updated on Dec 31 2017 7:04 AM

Kollywood focus on Janvi - Sakshi

తమిళసినిమా: కొత్త తారలను పరిచయం చేయడంలో కోలీవుడ్‌ ఎప్పుడూ ముందుంటుంది. అదే విధంగా వర్ధమాన నటీమణులు తమిళ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతారు. అతిలోకసుందరిగా పేరు గడించిన నటి శ్రీదేవి లాంటి వారు కోలీవుడ్‌లో కథానాయకిగా రాణించిన వారే. శ్రీదేవి కోలీవుడ్, టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలిగి ఆ తరువాత బాలీవుడ్‌లో సెటిల్‌ అయ్యారు. ఆ మధ్య నటిగా రీఎంట్రీ ఇచ్చి ఇంగ్లీష్‌ వింగ్లీష్, మమ్మీ వంటి చిత్రాలతో సత్తా చాటుకున్న శ్రీదేవి తాజాగా తన వారసురాలిగా పెద్ద కూతురు జాన్వీని రెడీ చేశారు. ఇప్పటికే హిందీలో కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో దడక్‌ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఆ చిత్రంలో నాజూగ్గా ఉండడానికి సన్నబడాలన్న దర్శకుడి ఆంక్షల మేరకు జాన్వి అందుకు కసరత్తులు చేసే పనిలో నిమగ్నమైంది. కాగా సెలబ్రిటీస్‌ను ఫొటోల్లో బంధించడానికి విమానాశ్రయాలు, నక్షత్ర హోటళ్లు, జిమ్‌ల వంటి ప్రాంతాల్లో ఫొటోగ్రాఫర్లు తచ్చాడుతుంటారు. అలా  శ్రీదేవి వారసురాలు జాన్వీ తాజాగా ఫొటోగ్రాఫర్‌ దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది. 

అందాలను మెరుగుపరచుకోవడంలో భాగంగా ముంబైలోని ఒక పేరు మోసిన జిమ్‌లో కసరత్తులు చేసి తిరిగెళుతున్న జాన్వీని ఒక ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాలో బంధించాడు. టైట్‌ బన్నియన్, రోస్‌ కలర్‌ లెగిగ్స్‌ ధరించిన జాన్వి తన కారు దగ్గరకు వెళుతూ ఫొటోగ్రాఫర్‌ను చూసి చిన్న స్మైల్‌ ఇచ్చింది. అది చాలు ఫ్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌కు టక్కున క్లిక్‌ చేసి జాన్వి అందమైన బొమ్మను తన కెమెరాలో బంధించారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఇక ఈ కథ అలా ఉంచితే జాన్వీని కోలీవుడ్‌ చిత్రాలలో నటింపజేయడానికి కొందరు ప్రముఖ దర్శకనిర్మాతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారన్నది తాజా సమాచారం. అయితే శ్రీదేవి తన కూతురిని మొదట కోలీవుడ్‌లోనే పరిచయం చేయాలని భావించారని, ఆ తరువాత మనసు మార్చుకుని బాలీవుడ్‌పై మొగ్గు చూపారని కోలీవుడ్‌ వర్గాలంటున్నాయి. ఇక జాన్వి కోలీవుడ్‌కొచ్చేదెప్పుడా అని ఇక్కడి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ కాలం ఎప్పుడొస్తుందో ఎదురు చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement