విరుష్కల పెళ్లి క్యారికేచర్‌ వైరల్‌ | Kohli And Anushka Marriage Portrait Viral On Social Media | Sakshi
Sakshi News home page

వైరల్‌గా మారిన విరుష్కల పెళ్లి క్యారికేచర్‌

May 15 2020 3:11 PM | Updated on May 15 2020 3:28 PM

Kohli And Anushka Marriage Portrait Viral On Social Media - Sakshi

ముంబై : ప్రముఖ సెలబ్రిటీ జంట విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మల పెళ్లి క్యారికేచర్‌ ఒకటి ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. దానిపై అభిమానులు విపరీతంగా మనసు పారేసుకున్నారు. విరుష్కల జంట పెళ్లి బట్టలతో ఉన్నట్లు గీసిన క్యారికేచర్‌ అది. శుక్రవారం అనుష్క శర్మ తన తాజా వెబ్‌ సిరీస్‌ ‘‘పాతాల్‌ లోక్‌’’ను ప్రమోట్‌ చేయటానికి ఇన్‌స్టాగ్రామ్‌లో వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ఓ ఫొటోను ఆమె షేర్‌ చేశారు. అయితే ఆ ఫొటోలోని విరుష్కల పెళ్లి క్యారికేచర్‌ అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. క్యారికేచర్‌పై అభిమానులు స్పందిస్తూ.. ‘‘  ఆ పేయింటింగ్‌ నా మనసు గెలుచుకుంది.. ఫొటోలోని బ్యాక్‌ గ్రౌండ్‌లో ఉన్న పేయింటింగ్‌ కోసం బ్రతుకుతున్నా.. క్యారికేచర్‌ అద్భుతంగా ఉంది ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( కరోనాపై పోరు: విరుష్కల మరో విరాళం )

కాగా, లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి పరిమితమైన విరాట్‌ కోహ్లి, అనుష్కల జంట సోషల్‌ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు ఇద్దరు. కరోనాపై పోరుకు విరాళాలు ఇవ్వటమే కాకుండా, లాక్‌డౌన్‌ కారణంగా మహిళలపై పెరుగుతున్న గృహ హింసపై స్పందించి తమ మంచి మనసు చాటుకున్నారు.

దవండి : ఆ సర్వేలో కోహ్లి జంట టాప్‌..!

Advertisement
 
Advertisement
Advertisement