జన్మజన్మల నాగబంధం | Kodi Ramakrishna 'Nagabharanam' Getting Ready To Release | Sakshi
Sakshi News home page

జన్మజన్మల నాగబంధం

Sep 21 2016 11:42 PM | Updated on Sep 4 2017 2:24 PM

జన్మజన్మల నాగబంధం

జన్మజన్మల నాగబంధం

పూర్వజన్మలో కోల్పోయిన అనుబంధాలు, ఆప్యాయతలను ఓ యువతి మరు జన్మలో ఏవిధంగా సొంతం చేసుకోగలిగింది?

 పూర్వజన్మలో కోల్పోయిన అనుబంధాలు, ఆప్యాయతలను ఓ యువతి మరు జన్మలో ఏవిధంగా సొంతం చేసుకోగలిగింది? నాగభరణంతో ఆమెకున్న సంబంధం ఏమిటి? అనే కథాంశంతో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నాగభరణం’. రమ్య ప్రధాన పాత్రధారి. జయంతి లాల్ గాడా సమర్పణలో సాజిద్ ఖురేషి, దవల్ గాడా, సోహైల్ అన్సారీ నిర్మించారు.

తెలంగాణ, ఏపీ పంపిణీ హక్కులను దక్కించుకున్న మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ‘‘ఓ కీలక పాత్ర కోసం స్వర్గీయ కన్నడ నటుడు విష్ణువర్థన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా సృష్టించడం జరిగింది. ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలకు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అందించిన మకుట సంస్థ ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సృష్టిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నా యి.’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సలావుద్దీన్ యూసఫ్, షబ్బీర్ హుస్సేన్.
 
 

Advertisement
 
Advertisement
Advertisement