అది నా డీఎన్‌ఏలో లేదు: కిమ్‌ శర్మ | Kim sharma slams condemns news on her divorce | Sakshi
Sakshi News home page

అది నా డీఎన్‌ఏలో లేదు: కిమ్‌ శర్మ

Apr 11 2017 6:33 PM | Updated on Sep 5 2017 8:32 AM

అది నా డీఎన్‌ఏలో లేదు: కిమ్‌ శర్మ

అది నా డీఎన్‌ఏలో లేదు: కిమ్‌ శర్మ

ఖడ్గం సినిమా ఫేం.. నటి కిమ్‌ శర్మ తన భర్త అలీ పంజానీతో విడిపోయారని.. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని వస్తున్న వార్తలను మంగళవారం ఆమె ఖండించింది.

ముంబై: ఖడ్గం సినిమా ఫేం.. నటి కిమ్‌ శర్మ తన భర్త అలీ పంజానీతో విడిపోయారని.. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని వస్తున్న వార్తలను మంగళవారం ఆమె ఖండించింది. అవన్నీ ఒట్టి పుకార్లేనని ట్విట్టర్‌ ద్వారా ఘాటుగా స్పందించింది. తన చుట్టూ ఉన్న అందరూ కొత్తగా ఏదో సంచలన విషయం తెలిసినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపింది.

ఇతరులపై అనవసర కామెంట్లు చేయడం తన డీఎన్‌ఏలో లేదని చెప్పింది. పుకార్ల కారణంగా తనకు మార్కెటింగ్‌, సెన్సేషన్‌లు వచ్చాయని వాటి ద్వారా మీరందరూ(మీడియాను ఉద్దేశించి) కొత్త సబ్‌స్క్రిప్షన్స్‌, వెబ్‌సైట్‌ క్లిక్‌లను తెచ్చుకోవచ్చని వ్యాఖ్యానించింది.

వ్యక్తిగత అంశాలపై దాడి చేయడం సరికాదని చెబుతూ.. ఆ కామెంట్లు చేయడం వల్ల బాధపడేవారని చూసుకుని చేయాలంటూ విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది కిమ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement