బన్నీకి హీరోయిన్‌ దొరికింది! | Kiara Advani May Act In Allu Arjun And Trivikram Movie | Sakshi
Sakshi News home page

Jan 3 2019 12:56 PM | Updated on Jan 3 2019 4:49 PM

Kiara Advani May Act In Allu Arjun And Trivikram Movie - Sakshi

‘నా పేరు సూర్య’ ఫలితంతో డీలాపడ్డ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నారు. న్యూ ఇయర్‌ కానుకగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌ ఉండనుందని ప్రకటించాడు. అయితే మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్రయూనిట్‌ తెలిపింది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. 

భరత్‌ అనే నేను ఫేమ్‌ కియారా అద్వాణీని ఈ చిత్రానికి హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘వినయ విధేయ రామ’ రిలీజ్‌కు రెడీ ఉండగా.. కియారా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఖాయమన్నట్లే కనిపిస్తోంది. వెంటవెంటనే బడా సినిమాలో నటిస్తూ.. ఈ భామ టాప్‌ ప్లేస్‌లోకి దూసుకెళ్లేట్టు కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్‌హాసిని క్రియేషన్స్‌పై తెరకెక్కించనున్న ఈ చిత్ర షూటింగ్‌ త్వరలోనే ప్రారంభంకానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement