భయపెడతానంటున్న కియారా | Kiara Advani In Kanchana Hindi Remake | Sakshi
Sakshi News home page

కాంచన హిందీ రీమేక్‌లో కియారా

Mar 7 2019 9:34 AM | Updated on Mar 7 2019 9:42 AM

Kiara Advani In Kanchana Hindi Remake - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రం ద్వారా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు కియారా అద్వానీ. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న కియారా త్వరలోనే ఓ సౌత్‌ దర్శకుడి సినిమాలో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో ‘కాంచన’ హిందీ రీమెక్‌లో నటించడానికి కియారా ఒప్పుకున్నట్లు తెలిసింది. లారెన్స్‌ ప్రస్తుతం కాంచన - 3 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారని తెలిసింది. రాఘవలారెన్స్‌ ఇంతకుముందు నటించి తెరకెక్కించిన ‘కాంచన’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయనున్నారు.

ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. అక్షయ్‌ కుమార్‌ ఇప్పటికే కోలీవుడ్‌లో 2.ఓ చిత్రంలో విలన్‌గా నటించి దుమ్మురేపిన సంగతి తెలిసిందే. పాత్ర నచ్చితే అది ఎలాంటిదైనా నటించడానికి సమ్మతించే అక్షయ్‌కి ‘కాంచన’ చిత్రం బాగా నచ్చిందట. దీంతో ఆ చిత్ర హిందీ రీమేక్‌లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఆయనకు జంటగా కియారా అద్వానిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో  రాజమౌళి తాజా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ ఒక హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుందనే ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement