ఈసారి ఆల్బమ్‌ కోసం... | Kesari Film Teri Mitti Song Out Akshay Kumar Parineeti Chopra | Sakshi
Sakshi News home page

ఈసారి ఆల్బమ్‌ కోసం...

Mar 31 2019 6:30 AM | Updated on Mar 31 2019 6:30 AM

Kesari Film Teri Mitti Song Out Akshay Kumar Parineeti Chopra - Sakshi

పరిణీతీ చోప్రా

పరిణీతీ చోప్రాలోని నటి గురించి మనందరికీ తెలుసు. కానీ ఆమెలో గాయని కూడా ఉంది. ఆల్రెడీ ఆడియన్స్‌కు తనలోని గాయనిని ఓసారి పరిచయం చేశారు. లేటెస్ట్‌గా మరోసారి గొంతు సవరించుకోవడానికి రెడీ అయ్యారు పరిణీతీ చోప్రా. బాలీవుడ్‌ గీత రచయిత మనోజ్‌ ముంటషీర్‌ రాసిన ‘తేరి మిట్టీ’ అనే పాటను ఆలపించనున్నారు పరణీతి. అర్మాన్‌ మాలిక్‌ స్వరపరచిన ఈ పాట సినిమా కోసం కాదు... ప్రైవేట్‌ ఆల్బమ్‌. ఇదివరకు పరిణీతీ చోప్రా నటించిన ‘మేరీ ప్యారీ బిందు’ సినిమాలో ‘మానా కే హమ్‌ యార్‌ నహీ’ అనే పాట పాడారు. ఆ పాటకు మంచి రెస్పాన్స్‌ లభించింది. కొంచెం గ్యాప్‌ తర్వాత మరో పాటతో సిద్ధమయ్యారు. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి. పరిణీతి నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘కేసరి’ బాక్సాఫీస్‌ దగ్గర మంచి కలెక్షన్లు రాబడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement