శర్వాతో శైలజ..! | Keerthy Suresh and Sharwanand in ks prakash Film | Sakshi
Sakshi News home page

శర్వాతో శైలజ..!

Jul 7 2017 1:57 PM | Updated on Sep 5 2017 3:28 PM

శర్వాతో శైలజ..!

శర్వాతో శైలజ..!

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. తొలి సినిమాతోనే

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. తొలి సినిమాతోనే ఘనవిజయం సాధించిన ఈ బ్యూటీ, నాని సరసన నేనులోకల్తో మరోసారి ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళనాట కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమాలో నటిస్తున్న కీర్తి మరో క్రేజీ ఆఫర్ను సొంతం చేసుకుంది.

బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా బ్యానర్లో తెరకెక్కుతున్న నెక్ట్స్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించనుంది. రాఘవేంద్రరావు తనయుడు కేయస్ ప్రకాష్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మహానటితో పాటు తెలుగులో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో లీడ్ హీరోయిన్గా నటిస్తుంది కీర్తి సురేష్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement