సౌత్‌ టు నార్త్‌ ఫుల్‌ బిజీ

Keerthy Suresh to foray into Bollywood with Ajay Devgn's sports biopic - Sakshi

కీర్తీసురేశ్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్, మేనేజర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అజయ్‌ దేవగన్‌ హీరోగా ‘బదాయి హో’ ఫేమ్‌ అమిత్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో అజయ్‌ భార్యగా కీర్తి నటించనున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ కాకుండా ఆమె మరో బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ కూడా ఓకే చేశారట. నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. తెలుగులో నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వంలో  ఓ లేడీ ఓరియంటెడ్‌ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు కీర్తి. ఇలా.. సౌత్‌ టు నార్త్‌ కీర్తి డైరీ ఫుల్‌ బిజీ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top