చెర్రీతో శైలజ | keerthi suresh selected for ramcharans next movie | Sakshi
Sakshi News home page

చెర్రీతో శైలజ

Jan 10 2016 12:28 PM | Updated on Sep 3 2017 3:26 PM

చెర్రీతో శైలజ

చెర్రీతో శైలజ

చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా నేను శైలజా, రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది...

చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా నేను శైలజా, రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మళయాలి ముద్దుగుమ్మ కీర్తి సురేష్. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్తో ఆకట్టుకున్న ఈ బొద్దుగుమ్మ మరో భారీ ఆఫర్ను సొంతం చేసుకుంది. తొలి సినిమాతోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటి రామ్ చరణ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది.

బ్రూస్ లీ సినిమా రిలీజ్ అయి ఇన్ని రోజులు గడుస్తున్నా, చరణ్ చేయబోయే నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీఒరువన్ సినిమాను రీమేక్ చేయబోతున్నట్టుగా ప్రకటించినా.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. దీనికి తోడు నటీనటుల ఎంపిక కూడా పూర్తవ్వకపోవటంతో సినిమా మొదలవ్వటానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే విలన్గా ఒరిజినల్ వర్షన్లో చేసిన అరవింద్ స్వామినే కన్ఫామ్ చేయగా హీరోయిన్ పాత్రకు కీర్తి సురేష్ను ఎంపిక చేశారన్న టాక్ వినిపిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement