మెగా నటుడు నాగబాబుపై కత్తి ఫైర్‌ | Kathi Mahesh Warning to Nagababu | Sakshi
Sakshi News home page

మెగా ఫ్యామిలీపై కత్తి ఫైర్‌

Jul 6 2018 8:37 AM | Updated on Jul 6 2018 9:26 AM

Kathi Mahesh Warning to Nagababu - Sakshi

నాగబాబూ.. మీ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడితే తట్టుకోవడం కష్టం

సాక్షి, హైదరాబాద్‌ :  సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే కత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్‌ చేశారు. వారిలో మెగా బ్రదర్‌ నాగబాబు ఒకరు. దీంతో నాగబాబు, మెగా ఫ్యామిలీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో కత్తి మహేశ్‌ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. 

‘నాగబాబు నా పేరు కూడా ఉచ్ఛరించకుండా నన్ను నీచుడిగా సంభోదిస్తూ చేసినటువంటి వీడియో నేను చూశాను. నాకు జాలి కలిగింది. నేనా నీచుడినా? అంత నీచానికి ఏం పాల్పడ్డానని ప్రశ్నించారు. ఒక అన్నకు తమ్ముడిగా.. ఒక తమ్ముడికి అన్నగా ఏమాత్రం అస్థిత్వం లేని మీరు నాగురించి మాట్లాడుతున్నారు. మీ ఫ్యామిలీ రామ భక్తులా.. ‘జనాల్ని మోసం చేయడం, ప్యాకేజీలు దండుకోవడం, ఉన్న పార్టీలను అమ్ముకొని వేరే పార్టీలో కలవడం. జబర్ధస్ట్‌లాంటి షోలో జడ్జ్‌గా కుర్చోని పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ ఉండటం ఇది మీ కాంట్రిబ్యూషన్‌ సొసైటీ.

మీరు హిందువు.. ఇక రాముడి ఆదర్శం గురించి మీ ఫ్యామిలీ ఎంత బాగా పట్టుదలతో ఉంటారనేది మాకందరికీ బాగా తెలుసు. మీ ఫ్యామీలీ, మీ అన్నదమ్ముల గురించి నేను మాట్లాడితే మీరు తట్టుకోవడం కష్టం. మీరు నాకు బెదిరింపులు ఇస్తారా. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నా మీద చేయి పడితే మీరే బాధ్యత వహిస్తారు. నేను చెప్పిందేంటో అర్ధం కానీ మీరు నాకు వార్నింగ్‌ ఇస్తారా.. ఇదే పంథా మీరు కొనసాగించండీ.. మీ రాజకీయ, సినిమా జీవితం ఎంత దౌర్భాగ్యమో అందరికీ వెలుగెత్తి చాటే రోజు ఒకటి వస్తుంది. మీ పతనానికి మీరే పునాది తవ్వుకుంటున్నారు.

సాధారణంగా నేను మనుషుల గురించి, వారి వ్యక్తిగతాల గురించి, వ్యక్తిత్వాల గురించి మాట్లాడే వాడ్ని కాదు.. నీచుడు అంటూ నన్ను ఒక దళితున్ని సంభోదించారు ఎంత అహంకారముంటే ఇలా చేస్తారోనని అర్థమవుతోంది. సెక్యులర్‌ హిందువులు ఎక్కడి నుంచి వచ్చారు? దళితుల మీద దాడి జరుగుతున్నపుడు మీరంతా నోరెందుకు మెదపలేదు. ముస్లింపై దాడి జరిగినపుడు మీరంతా ఏం చేస్తున్నారు? నా హక్కుల కోసం నేను పోరాడుతున్నాను. నా వాక్‌స్వాతంత్రం, భావాప్రకటన స్వేచ్ఛ కోసం నేను పోరాడుతున్నాను’ అని కత్తి మహేశ్‌ అన్నారు.

కత్తి మహేష్‌పై నాగబాబు కామెంట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement