కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలి : నాగబాబు

Actor Nagababu Demans Siviour Action On Kathi Mahesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలు ఎదుర్కొంటున్న సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జబర్ధస్త్‌ ఫేం, మెగా బ్రదర్‌ నాగబాబు డిమాండ్‌ చేశారు. ఏ మతాన్నైనా కించపరుస్తూ ఎవరు మాట్లాడిన తప్పేనని ఆయన అన్నారు. రామాయణం ఒక పుస్తకం కాదని, కోట్లాది మంది హిందువులు ఆరాధించే చరిత్ర అని వ్యాఖ్యానించారు. క్రైస్తవులకు బైబిల్‌, ముస్లింలకు ఖురాన్‌ ఎలాగో హిందువులకు రామాయణం, మహాభారతం అలాంటివని అన్నారు.

నాస్తికత్వం పేరుతో హిందువుల జోలికి వస్తే శిక్ష అనుభవిస్తారని, మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని నాగబాబు హెచ్చరించారు.  హిందూ మతం, దేవతలపై పథకం ప్రకారం దాడి జరుతోందని ఆరోపించారు. మతపరమైన చర్చలను ఎవరూ ప్రోత్సహించొద్దంటూ సూచించారు. హిందువుల మనోభావాలను కించపరిచిన కత్తి మషేష్‌పై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే చారిత్రాత్మక తప్పు చేసిన వారవుతారని అన్నారు. ఈ విషయాన్ని పోలీసులు తేలిగ్గా తీసుకుంటే ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని నాగబాబు చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top