ఆగష్టు 25న 'కథలో రాజకుమారి' | Kathalo Raja kumari Releasing on aug 25th | Sakshi
Sakshi News home page

ఆగష్టు 25న 'కథలో రాజకుమారి'

Jul 27 2017 10:35 AM | Updated on Aug 29 2018 3:53 PM

ఆగష్టు 25న 'కథలో రాజకుమారి' - Sakshi

ఆగష్టు 25న 'కథలో రాజకుమారి'

నారా రోహిత్ నటించిన మరొక విభిన్న కుటుంబ, ప్రేమకధా చిత్రం 'కధలో రాజకుమారి'.

నారా రోహిత్ నటించిన మరొక విభిన్న కుటుంబ, ప్రేమకధా చిత్రం 'కధలో రాజకుమారి'. రాజేష్ వర్మ సిరువూరి సమర్పణలో నిర్మించబడిన ఈ చిత్రానికి సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్ రెడ్డి, కృష్ణవిజయ్ నిర్మాతలు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ 'యు' సర్టిఫికేట్ అందుకొంది. సెన్సార్ సభ్యుల నుండి విశేష స్పందనను పొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు 25న విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రం 'కథలో రాజకుమారి'. సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన 'కథలో రాజకుమారి'ని ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి' అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement