కాటమరాయుడు టీం న్యూ ఇయర్ విషెస్ | Katamarayudu Making Video | Sakshi
Sakshi News home page

కాటమరాయుడు టీం న్యూ ఇయర్ విషెస్

Jan 1 2017 10:38 AM | Updated on Mar 22 2019 5:33 PM

కాటమరాయుడు టీం న్యూ ఇయర్ విషెస్ - Sakshi

కాటమరాయుడు టీం న్యూ ఇయర్ విషెస్

పవర్ స్టార్ అభిమానుల కోసం కాటమరాయుడు యూనిట్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు స్టిల్స్ మాత్రమే రిలీజ్ చేసిన కాటమరాయుడు టీం తొలి మేకింగ్ వీడియోనే

పవర్ స్టార్ అభిమానుల కోసం  కాటమరాయుడు యూనిట్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు స్టిల్స్ మాత్రమే రిలీజ్ చేసిన కాటమరాయుడు టీం తొలి మేకింగ్ వీడియోనే రిలీజ్ చేసింది. అంతేకాదు యూనిట్ సభ్యులంతా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొన్ని మేకింగ్ షాట్స్తో పాటు రిలీజ్ చేసిన ఈ వీడియో పవన్ విషెస్ చెప్పకపోవడం అభిమానులను నిరాశపరిచింది.

గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement