కరుణానిధి జీవితాన్ని మలుపుతిప్పిన ‘పరాశక్తి’

Karunanidhi What Kalaignar is to Tamil cinema - Sakshi

సినిమా తారలు సినీ లోకాన్నే కాకుండా రాజకీయ ప్రపంచాన్ని కూడా శాసించగలరు అని నిరూపించారు కరుణానిధి. సాంఘీక దురాచాల్ని, సామాజిక రుగ్మతలను వ్యతిరేకిస్తూ తీసిన సినిమాలే ఆయన వ్యక్తిత్వాన్ని చాటుతాయి. ఉన్నతమైన ఆశలు, ఆశయాలతో సినిమా రంగంలోకి వచ్చి తన పదునైన మాటలతో అప్పటి సమాజాన్ని ఎండగట్టారు.

తమిళ రాజకీయాలది, సినిమాలది విడదీయలేని బంధం. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు, సిని పరిశ్రమ రెండు సమాంతరంగా ఎదుగుతూ వచ్చాయి. నాటి నుంచి నేటి వరకూ కూడా అక్కడి సినిమాలు తమిళ ప్రజల మనోభావాలను అద్దం పడుతాయి. తన భావాలను బహిర్గతం చేయడానికి సినీ మాధ్యమాన్ని ఎంచుకున్నారు కరుణానిధి. ఆయన రచనలు అప్పటి సమాజాన్ని ఎండగట్టేవి. సమాజంలోని అసమానతల్ని వ్యతిరేకించడం కోసం సినిమాలనే ఒక బలమైన ఆయుధంగా ఎంచుకున్నారు.

స్క్రీన్‌ప్లే రచయిత నుంచి సీఎం దాకా..
1924, జూన్‌ 3 న మిళనాడులోని తిరుక్కువాలైలో ఆయన జన్మించారు కరుణానిధి. విద్యార్ధి దశ నుంచే సమాజంలో ఉన్న దురాచారాలను రూపుమాపడానికి నడుం బిగించారు. ముఖ్యంగా నాటి తమిళ సమాజంలో వేళ్లూనుకుపోయిన అంటరాని తనం, జమీందారీ వ్యవస్థ, బ్రాహ్మణ అధిపత్యానికి వ్యతిరేకంగా సినిమాలను తీసేవారు.

ప్రంభంజనం సృష్టించిన ‘పరాశక్తి’
కరుణానిధి సినీ కెరియర్‌లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం పరాశక్తి. 1952లో వచ్చిన ఈ చిత్రంలోని సంభాషణలు ఆనాటి తమిళ ప్రేక్షకులను కుదురుగా కూర్చోనివ్వలేదు. భారతీయ సినిమాలు అంటే పాటాలకే అధిక ప్రాధాన్యం అనుకునే రోజుల్లో పాటలు కాదు కావాల్సింది మాటలు అని తెల్చి చెప్పారు కరుణానిధి. ఆ మాటాలు కూడా రాజకీయ నాయకుల గుండేల్లో తూటాలుగా పెలాయి. బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ తీసిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతోనే శివాజీ గణేషన్‌ తమిళ తెరకు పరిచయమయ్యారు.

మనోహర సినిమా, రచయితగా కరుణానిధి ప్రతిభకు అద్దం పడుతుంది. మంత్రి కుమారా, పుదైయల్‌, పూంబుహర్‌, నేతిక్కుదండనై, చట్టం ఒరు విలయాట్టు, పాసం పరవైగల్‌, పొరుత్తుపొదుం లాంటి సినిమాలన్నీ కరుణ కలం నుంచే జాలువారాయి. దాదాపు 39 సినిమాలకు కథలను అందించారు. రచనలు, నవలు, నాటికలు, పాటలు ఇలా అన్ని రంగాల్లో ఆయన తన ప్రతిభను చాటుకున్నారు.

తమిళమంటే తరగని ప్రేమ..
మాతృభాష తమిళమంటే కరుణానిధికి తరగని అభిమానం. ద్రవిడ ఉద్యమ సమయం నుంచి ప్రారంభమైన ఈ బాషాభిమానం నేటికి తమిళనాడులో కొనసాగుతుంది. ఇప్పటకి కూడా తమిళ సినిమా పేర్లన్ని మాతృభాషలోనే ఉంటాయి. ఈ సాంప్రదాయం ఇంకా కొనసాగడానికి ప్రధాన కారణం కరుణానిధి. 2006లో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చారు. సినిమా పేరు తమిళంలోనే ఉంటే పన్ను మినహాయింపు ఇస్తానని ప్రకటిన చేశారు.

కరుణానిధి, ఎంజీఆర్‌ ఒకే సమయంలో ఎదిగారు. కరుణానిధి తన కలానికి పదును పెడితే.. దానికి ప్రాణం పోస్తూ వచ్చారు ఎంజీఆర్‌. ఇద్దరు ప్రాణ మిత్రులుగా ఉండేవారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా విజయవంతమైంది. వీరిద్దరిపై మణిరత్నం తీసిన సినిమా ‘ఇద్దరు’. కరుణానిధి 2011వరకు కథలు రాస్తూనే వచ్చారు. ఆయన రాసిన ‘పొన్నార్‌ శంకర్‌’ నవల ఆధారంగా.. పొన్నార్‌ శంకర్‌ పేరుతో 2011 సినిమా వచ్చింది. సినిమాలంటే ఆయనకు చాలా అభిమానం. అందుకే నేటి తరం హీరోలైన రజనీకాంత్‌, కమల్‌హాసన్‌తో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. కరుణా నిధి రెండు పడవలపై ప్రయాణం చేసి.. విజయవంతమయ్యారు. కలైంజ్ఞార్‌ కరుణానిధి మరణం.. తీరని లోటు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top