జీరో నుంచి వందకి తీసుకెళ్లింది

kartikeya exclusive interview about hippi movie - Sakshi

‘‘ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో నాకు ఫుల్‌ క్లారిటీ ఉంది. కన్‌ఫ్యూజన్‌ లేదు. కథ నాకు నచ్చి, డైరెక్టర్‌ చేయగలుతాడనే నమ్మకం వస్తే సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకుంటాను’’ అని కార్తికేయ అన్నారు. టీఎన్‌ కృష్ణ దర్శకత్వంలో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా కలైపులి యస్‌. థాను నిర్మించిన చిత్రం ‘హిప్పీ’. ఇందులో దిగంగనా సూర్యవన్షీ, జజ్బా సింగ్‌ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు.

► ‘హిప్పీ’ సినిమా బాగా వచ్చింది. నేను బాగా నటించాననే నమ్మకం ఉంది. ఆడియన్స్‌కి నన్ను నేను డిఫరెంట్‌గా చూపించుకోబోతున్నాను. సినిమా చూసిన తర్వాత రివ్యూలు ఎలా ఉంటాయి? ఆడియన్స్‌ నా గురించి ఎలా మాట్లాడుకుంటారు? అని ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నాను.

► జేడీ చక్రవర్తిగారి గురించి ‘జేడీ.. ఉంటే సినిమా ఫినిష్‌ కాదు. సెట్‌లో నుంచి వెళ్లిపోతారు’ అని కొందరు రాంగ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు. కానీ అంతా రివర్స్‌. ఆఫ్‌స్క్రీన్‌లో మేం ఫ్రెండ్స్‌ అయిపోయాం. సార్‌.. కొందరు మీ గురించి బ్యాడ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారని చెప్పాను. ‘వాళ్లు చెప్పింది నిజమే. నచ్చని సినిమాలకు నేను అలానే చేశా’నని జేడీ అన్నారు.

► టీఎన్‌కృష్ణగారు కథ చెబుతా అన్నప్పుడు ‘ఏమాయ చేసావె’ లాంటి సాఫ్ట్‌ లవ్‌స్టోరీ ఎక్స్‌పెక్ట్‌ చేశాను. కథ నరేట్‌ చేసిన తర్వాత అర్థం అయ్యింది. ఇది ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాకు ఫుల్‌ డిఫరెంట్‌ అని.

► ‘ఆర్‌ఎక్స్‌ 100’తో పెద్దహిట్‌ వచ్చిందని అందరూ అంటున్నారు. కానీ థానుగారులాంటి పెద్ద ప్రొడ్యూసర్‌ నాతో సినిమా చేయడానికి రెడీ అయినప్పుడు ఆ నమ్మకం నాకు వచ్చింది. నాపై నాకు భరోసా కలిగింది. ‘ఆర్‌ఎక్స్‌ 100 ’సినిమాను మేమే తీశాం. నాకు ఫస్ట్‌ ఎర్నింగ్‌ థానుగారే ఇచ్చారు. అడ్వాన్స్‌గా పది లక్షలు తీసుకున్నాను.

► ఒక హిట్‌ సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి నిజానికి ఒత్తిడిలోనే ఉన్నాను. ‘ఆర్‌ఎక్స్‌ 100’ రిలీజ్‌కు ముందు జీరోలో ఉన్నాను. ఆ సినిమా జీరో నుంచి 100కి తీసుకెళ్లింది. సో... ఇది 101 వస్తేనే సక్సెస్‌ వచ్చినట్లుగా ఫీల్‌ అవుతున్నాను.

► ‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో రొమాంటిక్‌ సీన్స్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. నా ఏజ్‌ ప్రకారం నాకు లవ్‌స్టోరీలే వస్తాయి. లవ్‌స్టోరీలు అన్నప్పుడు లిప్‌ లాక్‌లు తప్పవు. రియలిస్టిక్‌ సినిమాలు చేయాలి. న్యాచురల్‌గా ఉండాలి, అందరికీ కనెక్ట్‌ అవ్వాలి అన్నప్పుడు లిప్‌లాక్‌ సీన్స్‌ను కూడా న్యాచురల్‌గానే చూపించాలి.

► పాతికేళ్ల వయసు వచ్చేసరికి ఏ అమ్మాయికైనా, ఏ అబ్బాయికైనా ఎవరూ నచ్చకుండా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. కాలేజ్‌ డేస్‌లో ఓ లవ్‌ఫెయిల్యూర్‌ ఉంది.

► ఇప్పటి యంగ్‌ హీరోలతో కాంపిటీషన్‌ ఫీలయ్యే స్టేజ్‌కి నేను ఇంకా రాలేదు. నాకు పెద్దగా ఫ్యాన్స్‌ లేరనుకుంటా. ఇటీవల ఇద్దరు యంగ్‌ హీరోల మధ్య వినిపించిన ఫ్యాన్స్‌ వార్‌ మిస్‌అండర్‌స్టాండింగ్‌ వల్లే వచ్చిందని నా భావన.

► ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాకు ఫస్ట్‌ బ్యాడ్‌ రివ్యూస్‌ వచ్చాయి. ఇక క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేయాలా? అనుకున్నాను. నిజంగా భయం వేసింది. నెక్ట్స్‌ డే థియేటర్‌లోకి వెళితే ఆడియన్స్‌ బ్లాక్‌బస్టర్‌ అన్నారు. అప్పుడు రివ్యూస్‌పై కోపం వచ్చింది. ఏదైనా తేడా జరిగితే నాది, పాయల్, అజయ్‌ ఇలా అందరి కెరీర్‌లకు ఇబ్బంది కలిగేది.

► ప్రస్తుతం ‘గుణ 369, గ్యాంగ్‌లీడర్‌’ చేస్తున్నాను. శేఖర్‌రెడ్డి, వీవీ వినాయక్‌ దగ్గర అసిస్టెంట్‌గా వర్క్‌ చేసిన శ్రీ సరిపల్లితో సినిమా చేయబోతున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top