హిందీ కిర్రాక్‌ పార్టీ | Kartik Aaryan To Star In The Hindi Remake Of Kannada Film Kirik Party | Sakshi
Sakshi News home page

హిందీ కిర్రాక్‌ పార్టీ

Jul 19 2018 1:08 AM | Updated on Jul 19 2018 1:08 AM

Kartik Aaryan To Star In The Hindi Remake Of Kannada Film Kirik Party - Sakshi

కార్తీక్‌ ఆర్యన్‌

‘టెంపర్, ప్రస్థానం, అర్జున్‌ రెడ్డి, విక్రమ్‌ వేదా’ వంటి దక్షిణాది చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించి బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి కన్నడ హిట్‌ ‘కిర్రిక్‌ పార్టీ’ చేరింది. ఈ హిందీ రీమేక్‌కు అభిషేక్‌ జైన్‌ దర్శకత్వం వహిస్తారు. ‘సోను కే టిట్టు కీ స్వీటీ’ ఫేమ్‌ కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటించనున్నారు. అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలుత ఈ సినిమాలో హీరోగా సిద్ధార్థ్‌ మల్హోత్రాను సంప్రదించారట. ఆయన డేట్స్‌ కుదరక పోవడంతో ఆ చాన్స్‌ ఆర్యన్‌ను వరించిందని టాక్‌. రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో రక్షిత్‌ శెట్టి, రష్మిక మండన్నా, సంయుక్తా హెగ్డే ముఖ్య తారలుగా నటించిన ‘కిర్రిక్‌ పార్టీ’ చిత్రం తెలుగులో ‘కిర్రాక్‌ పార్టీ’ పేరుతో రీమేక్‌ అయిన విషయం గుర్తుండే ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement