కొత్త ప్రేమాయణం | Kartik Aaryan, Sara Ali Khan to star in Imtiaz Ali’s Love Aaj Kal sequel | Sakshi
Sakshi News home page

కొత్త ప్రేమాయణం

Mar 2 2019 5:52 AM | Updated on Mar 2 2019 5:52 AM

Kartik Aaryan, Sara Ali Khan to star in Imtiaz Ali’s Love Aaj Kal sequel - Sakshi

ప్రేమించుకునేందుకు ఢిల్లీ వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నారు హీరో హీరోయిన్లు కార్తీక్‌ ఆర్యన్‌ అండ్‌ సారా అలీఖాన్‌. అక్కడి నుంచి పంజాబ్‌కు ప్రయాణిస్తారట. వారి ప్రేమ జ్ఞాపకాలను వెండితెరపై చూడాలంటే చాలా టైమ్‌ ఉంది. ‘జబ్‌ వియ్‌ మెట్, రాక్‌స్టార్, హైవే’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో 2009లో ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘లవ్‌ ఆజ్‌ కల్‌’కు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు ఇంతియాజ్‌. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే వారం ఢిల్లీలో ప్రారంభం కానుంది.

కార్తీక్‌ ఆర్యన్, సారా అలీఖాన్‌ జంటగా నటిస్తారు. ఢిల్లీ షెడ్యూల్‌ తర్వాత ఈ టీమ్‌ పంజాబ్‌ వెళ్తుందట. ముంబైలో కూడా కొన్ని సీన్స్‌ను ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. ముందుగా ఈ సినిమాలో సారా అలీఖాన్‌ తండ్రి, ప్రముఖ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ సినిమాలో సైఫ్‌ నటించడం లేదని, ఆయన్ను ఆనుకున్న పాత్రలో రణ్‌దీప్‌ హుడా నటించనున్నారని తెలిసింది. ఇంతకుముందు ‘హైవే’ చిత్రం కోసం ఇంతియాజ్‌ అండ్‌ రణ్‌దీప్‌ కలిసి వర్క్‌ చేసిన విషయం తెలిసిందే. తాజా సీక్వెల్‌ను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement