కార్తీక్‌‌కు‌ దీపికా సలహా.. ఖండించిన డిజైనర్‌ | Kartik Aaryan Conducts Live Chat On His Instagram | Sakshi
Sakshi News home page

‘గడ్డం తీసేయాలి.. వద్దూ కావాలంటే వంట నేర్చుకో’

May 14 2020 5:00 PM | Updated on May 14 2020 5:24 PM

Kartik Aaryan Conducts Live Chat On His Instagram - Sakshi

ముంబై: బాలీవుడ్‌ యువ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ను గడ్డం ట్రిమ్‌ చేసుకోవాలని బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనె సూచించారు. కార్తీక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో  గురువారం నిర్వహించిన లైవ్‌ చాట్‌ సందర్భంగా.. కార్తీక్‌ను గడ్డం తీసేయాలని ఆమె సలహా ఇచ్చారు. అయితే ఈ లైవ్‌ చాట్‌లో కార్తీక్‌‌ తన గడ్డం తీసేయలా లేదా ఇలాగే ఉంచాలా అని  అభిమానులను అడగ్గా దీనిపై దీపికా పైవిధంగా స్పందించారు. అయితే కార్తీక్‌.. గడ్డం తీసేయాలని లేదంటే ఫుడ్‌ కట్‌ అంటూ తన తల్లి హెచ్చిరిస్తున్నట్లు చెప్పాడు. దీంతో తాను ఇప్పుడు గడ్డం తీసేయాలా వద్దా అని అభిమానులను సలహా అడిగాడు. (నాకెంతో ఇష్ట‌మైన వ్య‌క్తి ఆయ‌న: దీపిక)

దీనికి దీపికా పదుకొనె.. అమ్మాయి చేయి ఎత్తిన ఎమోజీని కామెంటు చేసి.. తాను కూడా కార్తీక్‌ తల్లికే మద్దతు ఇస్తున్నానని, వెంటనే  గడ్డం ట్రీమ్‌ చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఇక ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అనైతా ష్రాఫ్‌ అడ్జానీయా ఖండిస్తూ.. నువ్వు గడ్డం తీసేయకు.. మీ అమ్మ అన్నం పెట్టకుంటే నువ్వు వంట చేయడం నేర్చుకో’ అంటూ కామెంటు చేశారు. కాగా లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన కార్తీక్‌ ఈ ఖాళీ సమాయాన్ని వృధా చేయకుండా ఇంట్లో స్వయం ఉపాధి కల్పించుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్‌లను ఇంటర్య్వూ చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement