కొత్త ప్రయాణం | Kartik Aaryan and Kiara Advani kick start Bhool Bhulaiyaa 2 | Sakshi
Sakshi News home page

కొత్త ప్రయాణం

Oct 10 2019 2:20 AM | Updated on Oct 10 2019 2:20 AM

Kartik Aaryan and Kiara Advani kick start Bhool Bhulaiyaa 2 - Sakshi

కియారా అద్వానీ

భయం భయంగా ఓ గదిలోకి అడుగులు వేస్తున్నారు కియారా అద్వానీ. ఆ భయం వెనక ఉన్న నిజాన్ని కనిపెట్టడానికి ఆమెను వెంబడిస్తున్నారట కార్తీక్‌ ఆర్యన్‌. ఇంతలో పెద్ద శబ్ధం వచ్చిందట. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అనీస్‌ బాజ్మీ దర్శకత్వంలో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భూల్‌ భులయ్యా 2’. 2007లో అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘భూల్‌ భులయ్యా’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. కార్తీక్, కియారాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అన్నారు కియారా అద్వానీ. ‘భూల్‌ భులయ్యా 2’ చిత్రం వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది. మరోవైపు హిందీ చిత్రాల (‘లక్ష్మీబాంబ్, షేర్షా, ఇందూ కీ జవానీ’) షూటింగ్‌లతో పాటు ‘గిల్టీ’ అనే వెబ్‌సిరీస్‌తో కియారా ప్రస్తుతం మస్త్‌ బిజీ బిజీగా ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement