రొమాంటిక్‌ కామెడీ | karthikeya hippi movie first look release | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌ కామెడీ

Sep 22 2018 12:34 AM | Updated on Sep 22 2018 12:34 AM

karthikeya hippi movie first look release - Sakshi

కార్తికేయ

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో యూత్‌ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘హిప్పీ’. టి.ఎన్‌. కృష్ణ దర్శకుడు. వి క్రియేషన్స్, ఏషియన్‌ సినిమాస్‌ పతాకాలపై కలైపులి.యస్‌.థాను నిర్మిస్తున్నారు. శుక్రవారం కార్తికేయ పుట్టినరోజును పురస్కరించుకుని ‘హిప్పీ’  ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. టి.ఎన్‌.కృష్ణ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. తన తొలి చిత్రానికి భిన్నంగా, కేర్‌ఫ్రీ, క్యాజువల్‌గా సాగే పాత్రలో కార్తికేయ కనిపిస్తారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిది.

మన జీవితంలో నిత్యం జరిగే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. అక్టోబర్‌ నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు. ‘‘తెలుగులో నేరుగా సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ఇప్పటికి కుదిరింది. కార్తికేయ ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా చూశాను. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గ హీరో అనిపించింది’’ అన్నారు కలైపులి యస్‌.థాను. ‘‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత ఓ పెద్ద సంస్థలో అవకాశం రావడం నా అదృష్టం. కథ చాలా బావుంది. తొలి సినిమా ఇచ్చిన సక్సెస్‌ను కంటిన్యూ చేసే సినిమా అవుతుంది’’ అని కార్తికేయ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.డి. రాజశేఖర్, సంగీతం: నివాస్‌ కె.ప్రసన్న.

Advertisement
 
Advertisement
Advertisement