కార్తి స్పెషల్ ‘బిరియానీ’ రెడీ

కార్తి స్పెషల్ ‘బిరియానీ’ రెడీ

 కార్తి, హన్సిక కలిసి వడ్డించనున్న ‘బిరియాని’ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజాకు ఓ మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోనుంది. ఎందుకంటే అది యువన్‌కు వందో సినిమా. వెంకట్ ప్రభు దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞాన్‌వేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మిచారు. ఈ వారంలో పాటలను, 20న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా జ్ఞాన్‌వేల్‌రాజా మాట్లాడుతూ -‘‘కార్తీ ఇప్పటివరకూ చేయని విభిన్న పాత్రను ఇందులో చేశారు. యాక్షన్, కామెడీల కలబోత ఇది’’ అని చెప్పారు. మెండీ థాకర్ మరో నాయికగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: శక్తి శరవణన్, మాటలు: శశాంక్, వెన్నెలకంటి, సహనిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు.

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top