‘అందరికీ నచ్చే చిత్రం యురేక’ | Karteek Anands Eureka Telugu Movie Unit Press Meet | Sakshi
Sakshi News home page

‘అందరికీ నచ్చే చిత్రం యురేక’

Mar 7 2020 5:08 PM | Updated on Mar 7 2020 5:18 PM

Karteek Anands Eureka Telugu Movie Unit Press Meet - Sakshi

కార్తీక్ ఆనంద్, డింపుల్ హయతి, సయ్యద్ సోహైల్ రియాన్, షాలిని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యురేక’. ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఫెస్ట్‌ నేపథ్యంలో సాగే లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. లక్ష్మీ ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రశాంత్‌ తాత ఈ సినిమా నిర్మించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ ముఖ్య అథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘యువత అంతా కలసి అవగాహనతో తీసిన సినిమా యురేక. మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో అందరూ బాగా నటించారు. డైరెక్టర్ కార్తీక్ వాళ్ళ పేరెంట్స్ తనకు బాగా సపోర్ట్ చెయ్యడం వల్లే బెస్ట్ ఔట్ పుట్ వచ్చింది. సినిమా అంతా బాగుంది. ప్రధానంగా సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది. ఆర్కే గారు ఈ సినిమాలో మంచి రోల్ చేశారు.  చిత్ర యూనిట్‌కు బెస్ట్‌ విషెస్‌ తెలుపుతున్నా’అని అన్నారు. 

‘కాలేజీలో జరిగే ఒక ఫంక్షన్ లో జరిగే సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండబోతొంది. ఇటీవల విడుదలైన మా సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నైట్ ఎఫెక్ట్ లో వచ్చే ఎపిసోడ్స్ ను కెమెరామెన్ విశ్వ బాగా తీశాడు. మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ మంచి సాంగ్స్ తో పాటు బెస్ట్ రీ రికార్డింగ్ ఇచ్చాడు. మా నిర్మాత ప్రశాంత్ తాత గారి సపోర్ట్ మరువలేనిది.  నన్ను నమ్మి ఈ సినిమా చేశారు’అని దర్శకుడు కార్తీక్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. 

హీరో సయ్యద్ సోహైల్ రియాన్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ కార్తీక్ ఆనంద్ నాకు మంచి రోల్ ఇచ్చారు. మంచి సినిమాలో  నటించానన్న ఆనందం ఉంది. చిన్న సినిమాలకు అందరి సపోర్ట్ కావాలి. ఎన్నో ఇబ్బందుల్లో కూడా డైరెక్టర్ కార్తీక్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. యురేక మీ అందరికి నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నా’అని అన్నాడు. బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్‌, రాకేట్‌ రాఘవ, మహేశ్‌ విట్టా తదితరులు నటించిన ఈ చిత్రానికి నరేష్‌ కుమారన్‌ సంగీతమందించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement