కరీష్మా కపూర్‌ రెండో పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ | Karisma Kapoor-Sandeep Toshniwal to get married | Sakshi
Sakshi News home page

మాజీ హీరోయిన్‌ రెండో పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌!

Apr 17 2017 11:39 AM | Updated on Sep 5 2017 9:00 AM

కరీష్మా కపూర్‌ రెండో పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌

కరీష్మా కపూర్‌ రెండో పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌

ఒకప్పటి బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కరీష్మా కపూర్ పెళ్లి విషయంలో తన మాజీభర్త సంజయ్‌ కపూర్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

ముంబయి: ఒకప్పటి బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కరీష్మా కపూర్ పెళ్లి విషయంలో తన మాజీభర్త సంజయ్‌ కపూర్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె రెండోపెళ్లికి  లైన్‌ క్లియర్‌ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త సందీప్‌ తోష్నివాల్‌ను ఆమె త్వరలోనే పెళ్లాడబోతుందట. ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. కరీష్మా మాజీభర్త సంజయ్‌ కపూర్‌ తన ప్రేయసి ప్రియా సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కరీష్మా కూడా సందీప్‌ను వివాహం చేసుకోనున్నట్లు ఓ వెబ్‌సైట్‌ కథనం ప్రచురించింది.

కాగా సందీప్‌ తోష్నివాల్‌కు అతడి భార్య అశ్రిత విడాకులు ఇచ్చేందుకు సుముఖంగా ఉండటంతో ఈ పెళ్లికి దాదాపు గ్రీన్‌ సిగ్నల్‌ పడినట్లే.  గతంలో విడాకులు ఇచ్చేందుకు అశ్రిత ఇష్టపడలేదు. అయితే గత కొంతకాలంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అశ్రిత..తన భర్తకు డైవర్స్‌ ఇవ్వడానికి సిద్ధపడటంతో, అందుకు సంబంధించిన ఫార్మాలిటీస్‌ కూడా మొదలయ్యాయట. ఇందుకోసం ఆమె భారీగానే భరణం డిమాండ్‌ చేసిదంట. ఢిల్లీలో ఉన్న ఇంటితో పాటు అశ్రితకు రూ.రెండు కోట్లు, అలాగే ఇద్దరు పిల్లలకు చెరో రూ.3 కోట్లు ఇచ్చేందుకు సందీప్‌ తోష్నివాల్‌ అంగీకరించినట్లు సమాచారం.

అలాగే ఇద్దరు కూతుళ్లు తల్లి కస్టడీలోనే ఉండనున్నారు. సందీప్‌ తోష్నివాల్‌తో అశ్రిత వివాహం 2013లో జరిగింది. అయితే భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆరోపణలు చేయడంతో వారిద్దరి వివాహ బంధానికి బీటలు ఏర్పడ్డాయి.  సందీప్‌ తరఫు న్యాయవాది మాత్రం అర్షిత మానసిక రుగ్మతతో బాధపడుతోందని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అయితే చికిత్స తీసుకునేందుకు ఆమె నిరాకరించిందని, అశ్రితతో విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

ఇక కరీష్మా, సందీప్‌ తోష్నివాల్‌ బంధం గురించి మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తు వార్తలు కూడా వెలువడ్డాయి. ఇటీవలే కరీనా తన కొడుకు పుట్టిన సందర్భంగా ఇచ్చిన పార్టీలోనూ సందీప్‌ తోష్నివాల్‌  హడావుడి కూడా కనిపించింది. కరీష్మా కుటుంబం కూడా వీరి పెళ్లికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement