2209కి తీసుకెళ్తాను

Kannada hero sudeep starts new movie - Sakshi

టైమ్‌ మిషన్‌ ఎక్కి 200 సంవత్సరాలు ముందుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు కన్నడ హీరో సుదీప్‌. ఆయన వెళ్లడమే కాదు ప్రేక్షకుల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు. ‘బిల్లా రంగా భాషా’ చిత్రం కోసమే ఈ టైమ్‌ మిషన్‌ ప్రయాణం. 2209లో ఈ చిత్రకథ సాగనుంది.

అనూప్‌ బండారీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనుంది.  ‘‘190 ఏళ్ల తర్వాత జీవన విధానం ఎలా ఉండబోతోందనే కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రత్యేకంగా 2209 అనే సంవత్సరాన్నే ఎందుకు చూపిస్తున్నామో సినిమా చూసి తెలుసుకోవాలి. సుదీప్‌ సరికొత్త గెటప్స్‌లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top