‘వీళ్లిద్దరినీ ఆశీర్వదించండి’ | Kangana Ranaut Happy Moments In Her Brother Engagement | Sakshi
Sakshi News home page

ఘనంగా హీరోయిన్‌ సోదరుడి నిశ్చితార్థం

Nov 9 2019 4:47 PM | Updated on Nov 9 2019 8:51 PM

Kangana Ranaut Happy Moments In Her Brother Engagement - Sakshi

బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ సోదరుడు అక్షిత్‌ రనౌత్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. రీతూ అనే యువతితో శుక్రవారం అతడి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరి రంగోలితో పాటు కంగనా సందడి చేశారు. సంప్రదాయ బనారస్‌ పట్టుచీర ధరించి.. ఆటపాటలతో ఉత్సాహంగా గడుపుతూ బంధువులను పలకరించారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను రంగోలి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘ కొత్త జీవితం ప్రారంభించబోతున్న ఈ ఇద్దరినీ ఆశీర్వదించండి’ అని ట్వీట్‌ చేశారు.

ఈ క్రమంలో అక్షిత్‌ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెబుతూనే... కంగనా పెళ్లి కూడా త్వరగా జరగాలంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా క్వీన్‌ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న కంగనా.. ఈ ఏడాది జడ్జిమెంటల్‌ హై క్యా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆమె తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement