నాన్న మంచి విమర్శకుడు! | kamal haasan watched shruti haasan hindi movie Behen Hogi Teri | Sakshi
Sakshi News home page

నాన్న మంచి విమర్శకుడు!

Jun 13 2017 6:25 PM | Updated on Sep 5 2017 1:31 PM

నాన్న మంచి విమర్శకుడు!

నాన్న మంచి విమర్శకుడు!

తన తండ్రి మంచి విమర్శకుడని చెబుతోంది హీరోయిన్‌ శ్రుతీహాసన్‌.

తన తండ్రి మంచి విమర్శకుడని చెబుతోంది హీరోయిన్‌ శ్రుతీహాసన్‌. ఇటీవల సంఘమిత్ర చిత్రానికి గుడ్‌బై చెప్పి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇంతకీ విషయం ఏమిటంటే శ్రుతీహాసన్‌ నటించిన హిందీ చిత్రం ‘బెహన్‌ హోగి తేరి’  చిత్రం  ప్రచారం కోసం దేశంలోని పలు ప్రధాన నగరాలు చుట్టొచ్చిన శ్రుతీహాసన్‌ ఇప్పుడు చెన్నైకి చేరుకున్నారు.

కాగా తను నటించిన బెహన్‌ హోగి తేరి చిత్రాన్ని తన తండ్రి, మిత్ర బృందానికి చెన్నైలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రుతీహాసన్‌ ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేస్తూ, బెహన్‌ హోగి తేరి చిత్ర ప్రత్యేక షోను తన తండ్రి, స్నేహితుల కోసం ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. సినిమా చూసిన తరువాత నాన్న .. ఈ మూవీ గురించి చాలా మాట్లాడారని తెలిపారు. ఆయన తనకు తండ్రి మాత్రమే కాదని, మంచి విమర్శకుడు కూడానని అన్నారు.

నాన్న సలహాలు తనకు సినిమా పరంగానూ, వ్యక్తిగత జీవితంలోనూ ఉన్నతికి దోహదపడతాయన్నారు. ఈ చిత్రంలో తన నటనను అందరూ ప్రశంసించడం సంతోషంగా ఉందని శ్రుతీహాసన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలో నాన్నతో కలిసి ఉన్న శ్రుతీహాసన్‌ కొన్ని రోజుల విశ్రాంతి తీసుకుని లండన్‌కు పయనం కానున్నారట.

అక్కడ తన సంగీత స్నేహ బృందంతో కలిసి సంగీత ఆల్బంను పూర్తి చేయనున్నారట. ఈ ఆల్బంను ఈ ఏడాది చివరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు శ్రుతీహాసన్‌ వెల్లడించారు. శ్రుతీహాసన్‌ తదుపరి తన తండ్రితో కలిసి త్రిభాషా చిత్రం శభాష్‌ నాయుడులో నటించడానికి రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement